రిలయన్స్ ఎందుకు వాటాదార్లని మోసం చేసి మరీ మిమ్మల్ని రక్షించింది?

print this page
చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టులో ఒక బెంచ్ విచారణకు స్వీకరించి, సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది.
అదే హైకోర్టులోని మరో ధర్మాసనం.. సదరు ప్రాథమిక విచారణను నిలిపివేయటమే కాక ఏకంగా పిటిషన్‌నే కొట్టివేసింది.

********************
ఇది చంద్రబాబునాయుడి విజయమా? ఆయన విజయం సాధించింది ఎవరిపైన? ముందు తనపై విచారణకు ఆదేశించిన బెంచ్‌పైనా? లేక ప్రజాహిత వ్యాజ్యంలో ఓడిన ప్రజలపైనా? విజయమ్మ ఆరోపణల్లో ఒక్కటీ వాస్తవం కాదని, తనంత నీతిమంతుడు లేడు కనకే హైకోర్టు ఆ తీర్పునిచ్చిందని గురువారం తెల్లారినుంచి చెలరేగిపోతున్న బాబు... అదే విషయాన్ని తనే నిరూపించుకోవచ్చు కదా? విజయమ్మ పిటిషన్లో వేసిన ప్రశ్నలకు తన దగ్గరున్న ఆధారాలేవో చూపిస్తే సరిపోతుందిగా? దీనిపై జనంలో ఇక ఎలాంటి గందరగోళానికీ తావుండదుగా? కోర్టుల్లో బాబు ఏ డ్రామాలూ ఆడలేదని కూడా తేలిపోతుందిగా? సరే, వీటికి కాకపోయినా ఈ కింది ప్రశ్నలకైనా బాబు దగ్గర బదులుందా?

*‘సత్యం’ మీ అబ్బాయి ఫీజు కట్టలేదా?
* ఉదాహరణకు సత్యం కుంభకోణాన్నే తీసుకుందాం. బాబు కుమారుడు లోకేశ్‌కు కార్నెగీ మిలన్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదువుకోవటానికి సత్యం కంప్యూటర్స్ సంస్థ తరఫున అప్పటి దాని చైర్మన్ రామలింగరాజు డొనేషన్ కట్టారన్నది విజయమ్మ ఆరోపణ.

ఈ ఆరోపణ అబద్ధమంటున్న చంద్రబాబునాయుడు... దానికి తగ్గ ఆధారాలేవీ చూపించరేం? లోకేశ్‌కు మెరిట్‌లోనే సీటొచ్చిందా! వస్తే టోఫెల్ స్కోరెంత? జీఆర్‌ఈ స్కోరెంత? ఆ స్కోర్ కార్డులేమీ రహస్య పత్రాలు కావుగా! చూపించొచ్చుగా! పోనీ ఆ యూనివర్సిటీల్లో డొనేషన్ కట్టి ఉంటే అవి ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఉండాలిగా? అలా రిటర్నుల్లో కూడా లేవెందుకు? అటు లోకేశ్ రిటర్నుల్లో గానీ, ఇటు చంద్రబాబు, భువనేశ్వరి రిటర్నుల్లో గానీ ఆ ఖర్చుల వివరాలు లేవెందుకు? ఒకవేళ చూపించి ఉంటే ఆ రిటర్నుల్ని బాబు బయటపెట్టొచ్చు కదా? చానళ్ల ముందు నోటికొచ్చినట్టు మాట్లాడే బాబు తైనాతీలైనా ఈ ఆధారాలు చూపించరేం? ఒకవైపు రామలింగరాజు ఈ డొనేషన్ కట్టినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని సీబీఐ వర్గాలు కూడా చెబుతున్నా బాబు ఇంత బుకాయిస్తారేం? మరీ ఇంత బరితెగింపా? ఈ వ్యవహారంలో తన దగ్గరున్న ఏ ఒక్క ఆధారాన్ని బాబు చూపించినా ఇక సమస్య ఉండదుగా?

*ఐఎంజీ మీ జేబు సంస్థ కాదా?
* అసలు బిల్లీ రావు ఎవరు? ఆయన స్థాయేంటి? ఐదు లక్షల రూపాయల మూలధనంతో ఏర్పాటైన సంస్థకు హైటెక్ సిటీ పక్కన 835 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్ని బాబు అసలెలా సమర్థించుకుంటారు? ఐఎంజీ సంస్థతో తనకు సంబంధం లేదని బాబు చెబుతున్నా.. దానికి అనుబంధ సంస్థగా ‘భారత’ అనే పేరును తగిలించిన బిల్లీరావు ఆయన బినామీ కాదా? అసలు బిల్లీరావుకు మీరు ఊహించినంతటి నిర్మాణాలు చేయగల సామర్థ్యముందని గానీ, లేక ఐఎంజీ ఫ్లోరిడాతో దానికి సంబంధాలున్నాయని గానీ నిరూపించగలరా బాబూ? అందుకు ఆధారాలుంటే చూపించొచ్చుగా?

*హెరిటేజ్ వాటాదార్లని మోసం చెయ్యలేదా?
* హెరిటేజ్ ఫుడ్స్ పేరిట ఉన్న విలువైన భూమిని.. కారు చౌకగా మీ భార్య పేరిట ఉన్న సంస్థకు బదలాయించేసి హెరిటేజ్ ఇన్వెస్టర్లందరి జేబులూ కొల్లగొట్టడం నిజం కాదా బాబూ? 100 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం రెండున్నర కోట్లకు మీ భార్య పేరిట ఉన్న సంస్థకు బదలాయించేసి.. ఆ వెంటనే దానిపై రూ.40 కోట్ల అప్పు తెచ్చుకోవటం అబద్ధమా?

* నిజంగా ఆ స్థలం విలువ రూ.2.5 కోట్లే అయితే, కేవలం నాలుగు నెలల తరవాత మీకు దానిపై రూ.40 కోట్ల రుణమివ్వటానికి అప్పిచ్చినవాళ్లు పిచ్చివాళ్లా? పెపైచ్చు మీ భార్య సంస్థకు బదలాయించిన భూమిని హామీగా పెట్టి సుజనా చౌదరికి అప్పు ఇప్పించాల్సినంత అవసరం మీకేమొచ్చింది? సుజనా చౌదరి మీ వ్యాపార భాగస్వామి అనేది దీన్ని బట్టి రుజువవటం లేదా? ఈ సుజనా చౌదరి మనీ లాండరింగ్ ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల్ని విదేశాల నుంచి ఇక్కడికి తరలిస్తుండటం అబద్ధమా? పన్నుల ఎగవేతకు సంబంధించి ఆయనపై కొన్ని పదుల కేసులు పెండింగ్‌లో ఉండటం అబద్ధమా? సుజనా చౌదరితో కలిసి మీరు అమెరికాకు వెళ్లి విరాళాలు వసూలు చేసి, వాటిని అక్రమ మార్గాల్లో ఇండియాకు తరలించిన మాట నిజం కాదా? వీటిలో ప్రతి ఒక్కదానికీ ఆధారం స్పష్టంగా కనిపించటం లేదా? ఇవన్నీ తప్పయితే, నోటికొచ్చినట్లు మీ భజంత్రీలతో మాట్లాడించటం కాకుండా మీరే ఆధారాలు చూపించొచ్చు కదా!

*రిలయన్స్ ఎందుకు వాటాదార్లని మోసం చేసి మరీ మిమ్మల్ని రక్షించింది?
* రామోజీతో మీకు ఏ సంబంధమూ లేదనే అనుకుందాం! మరి మార్గదర్శి పేరిట డిపాజిటర్లను మోసం చేసిన కేసులో రామోజీరావు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు రాజకీయంగా మీరు, ఆర్థికంగా ముకేశ్ అంబానీ కలిసి ఆయ న్ను ఒడ్డున పడేయటానికి ఎందుకంత తాపత్రయపడ్డారు?

కృష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు తవ్వుకోవటానికి ముకేశ్ అంబానీకి మీరు ఏ ప్రభుత్వమూ చేయనంతగా సహకరించటం నిజం కాదా? స్టాంపు డ్యూటీలు, రిజిస్ట్రేషన్ చార్జీలను సంపూర్ణంగా మినహాయించటమే కాకుండా, ఎక్కడా లేని విధంగా టెలికం సంస్థను ఐటీ సంస్థగా గుర్తించి, ఐటీ సంస్థలకిచ్చిన అన్ని రాయితీలనూ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇవ్వటం నిజం కాదా? దీనికి ప్రతిగానే అది మీ ఎల్లో సిండికేట్ భాగస్వామి అయిన రామోజీరావును ఆదుకోవటానికి రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టిందనటం అబద్ధమా? లేకుంటే ఎక్కడో ముంబైలో ఉండే సంస్థ.. పీకల్లోతు నష్టాల్లోనూ వివాదాల్లోనూ కూరుకుపోయిన రామోజీరావును ఆదుకోవటానికి ఎందుకు అక్కడి నుంచి పరిగెత్తుకుని వస్తుంది? దానికీ రామోజీరావుకూ అంతకుముందు ఎన్నడూ వ్యాపార భాగస్వామ్యాలు లేవే? దీనికి బాబు జవాబివ్వరేం? ఎన్నడూ ఏ ఆధారాలూ చూపించరేం?

* చంద్రబాబుగారూ! రామోజీ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడి పెట్టింది మీరు చేసిన సాయానికి ప్రతిగా కాకపోతే.. నాలుగేళ్ల పాటు ఏ మాత్రం లాభం లేకుండా చివరికి... తన రూ.2,600 కోట్లకు గాను అందులో సగం కూడా విలువ చెయ్యని ప్రాంతీయ భాషా చానళ్లను రామోజీ అంటగడితే అంత గొప్ప రిలయన్స్ కిమ్మనకుండా ఎందుకు తీసుకెళ్లింది? ఇంతటి మురికి ఒప్పందం ఎవరికి మేలు చేయడానికి?

*అమ్మణ్ణమ్మకు అంత డబ్బెక్కడిది?
* మీ అమ్మ అమ్మణ్ణమ్మకు సొంతంగా ఆస్తులేమీ లేవు. ఆదాయమూ లేదు. కానీ 2000లో హైదరాబాద్‌లోని మదీనగూడలో ఆమె రూ.40 లక్షలు పెట్టి ఐదెకరాల భూమి కొన్నారు. అప్పుడే బంజారాహిల్స్‌లో రూ.35 లక్షలు పెట్టి మరో భవనాన్ని కూడా కొన్నారు. ఏడాది తిరక్కముందే ఆ రెండు ఆస్తులనూ మీ అబ్బాయి లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చేశారు. అమ్మణ్ణమ్మకు మీతో పాటు మీ సోదరుడు రామ్మూర్తినాయుడు, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంతమంది ఉండగా మీ అబ్బాయికే అవన్నీ బహుమతిగా ఇచ్చేశారెందుకు? అవి మీ బ్లాక్ మనీతో కొన్న ఆస్తులు కాదనగలరా?

*ఆది నుంచీ అబద్ధాలే...
* 1994లో హెరిటేజ్ ఫుడ్స్ ప్రాస్పెక్టస్‌లో మీరు అంతకుముందు ఏ వ్యాపారాలూ చేయలేదన్నారు. కానీ భువనేశ్వరీ కార్బయిడ్స్ అండ్ కెమికల్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అల్లాయిస్ కంపెనీలకు ఎండీగా వ్యవహరించలేదా? ఆ విషయాన్ని కావాలని దాచిపెట్టలేదా? ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ అబద్ధమైతే ఆధారాలు చూపించొచ్చుగా? కోర్టులకు కాకపోయినా.. కనీసం జనానికైనా!!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...