* ఆనాడెందుకంత టెన్షన్...? ఈరోజెందుకంత ఉత్సాహం?
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసినంత మాత్రాన తాము వదలిపెట్టబోమనీ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళతామని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇల్లలకగానే పండగై పోయిందని భావించవద్దనీ, ముందుంది ముసళ్ల పండుగని బాబు గుర్తుంచుకుంటే మంచిదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన ఆస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్ కొట్టి వేయడంతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్న బాబు... గత అక్టోబర్ 17న న్యాయమూర్తి గులాం మహ్మద్ నేతృత్వంలోని బెంచి ఇదే కేసును సీబీఐ, డీజీపీ, రాష్ట్ర హోంశాఖలను విచారించాల్సిందిగా ఆదేశించినపుడు ఎందుకు టెన్షన్‌కు గురయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదు కనుక ఉత్సాహంగా, మనోధైర్యంతో ఉన్నానని ఈరోజు చెప్పుకుంటున్న బాబు ఆరోజు టెన్షన్‌కు గురి కావడాన్ని బట్టే ఆయన విచారణను ఎదుర్కోవడానికి ఎంత భయపడ్డారో తెలిసిపోతోందని ఎద్దేవా చేశారు.
బంధాల గురించి ‘వెన్నుపోటు’ బాబు మాట్లాడటమా...
తీర్పు అనుకూలంగా వచ్చిందనే మితిమీరిన ఉత్సాహంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపైనా, ఆయన కుటుంబంపైనా, జగన్‌పైనా చంద్రబాబు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘కొడుకును ఎలా పెంచాలో వైఎస్సార్‌కు అసెంబ్లీలో సలహా ఇచ్చానని చెప్పుకుంటున్నాడు... పెంపకం గురించీ, రక్త సంబంధం గురించీ, ఆత్మీయానురాగాల గురించీ వైఎస్సార్‌కు బాబు సలహా ఇవ్వడమా...! ఆసలు ఆయనకు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు. పిల్లనిచ్చిన మామను గద్దె దించి ఆయన మరణానికి కారణమైంది చాలక ఆయన కుటుంబాన్ని చిందరవందర చేశాడు. చివరకు తోడల్లుడినీ, బావమరుదులనూ వాడుకుని వదిలేశాడు. సొంత తమ్ముడినే వాడుకుని తాను రాజకీయంగా ఎదిగాడు...’’ అని రాంబాబు ధ్వజమెత్తారు.
‘‘అంతెందుకు లోకేష్ ఎలాంటివాడో... ఆయన పెంపకం ఎలా జరిగిందో... అసలు చంద్రబాబు కుటుంబీకుల గురించి ప్రజలేమనుకుంటున్నారో... చెట్టుకింద ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు... అవి నేను చెప్పడం బాగుండదు... కానీ అవి బాబు చెవికి సోకకపోవడం ఆయన దురదృష్టం’’ అని వ్యాఖ్యానించారు. నిజంగా బాబు పెంపకం అంతబాగుంటే లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి ఖర్చు చేసిన కోట్ల రూపాయలను ఎవరు చెల్లించారో వెల్లడించాలని ఆయన సవాలు విసిరారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వెచ్చించారో బాబు ఇప్పటివరకూ తన ఆదాయపుపన్ను వివరాల్లో వెల్లడించనే లేదనీ, బాబు పెంపకం ఇలాంటిదేనని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ పెంపకం గొప్పగా ఉంది కనుకనే ఆ తండ్రికి తగ్గ తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో తిరుగుతూ వారి రుణం తీర్చుకుంటున్నారని చెప్పారు

0 comments:
Post a Comment