ఎల్లో సిండికేట్ ఆడుతున్న డ్రామాలో మొదట చెప్పిన డైలాగులకు- ఇప్పుడు చెపుతున్న డైలాగులకు సంబంధం కుదరటం లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు కారణం క్విడ్ ప్రో కో అన్నది మొదటి వాదన అయితే... ఇన్వెస్టర్లకు సంస్థ ఖరీదును ఎక్కువ చేసి చూపించటం వల్లే వారు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టారన్నది ఇప్పటి వాదన. అసలు క్విడ్ ప్రోకో వాదనే నిజమనుకుంటే పెట్టుబడులు పెట్టే వారికి విలువల అంచనాలెందుకు? తమకు ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తి అందుకు ప్రతిగా ఎంత డబ్బు పెట్టుబడి పెట్టమంటే అంత పెట్టి తీరాలి.
దానికి నిర్ధరణలూ, నివేదికలూ ఆ నివేదికల్ని పంచడాలూ ఉండవు. ఇదిగో... ఇక్కడే తేలిపోయింది ఈ ఎల్లో మీడియా వాదనలన్నీ ఒట్టి బూటకాలని. అందుకే అవిప్పుడు విలువను పెంచి చూపించారని, దాని ఆధారంగానే పెట్టుబడులు వచ్చాయని బొంక జూస్తున్నాయి. అదీకాక సాక్షి ఇన్వెస్టర్ల అంచనాలకు అనుగుణంగానే సర్క్యులేషన్‌ను, పాఠకాదరణను సాధించిందన్న నిజాన్ని ఒప్పుకోవటానికి వారికిప్పటకీ మనసు రావటం లేదు. ఎందుకంటే అలా ఒప్పుకుంటే ‘సాక్షి’లోకి పెట్టుబడులన్నీ పారదర్శకంగా వచ్చాయని, ఇన్వెస్టర్లు వ్యాపార నిర్ణయంలో భాగంగా చక్కటి నిర్ణయం తీసుకున్నారని అంగీకరించటమే. అలా చేస్తే జగన్‌మోహన్‌రెడ్డిని దుమ్మెత్తిపోసే ప్రచారం చేయటం కష్టం.
అందుకే రోజుకో మాట. పూటకో రాత. పోటీ మీడియా అక్కసంతా ‘సాక్షి’ విజయం నుంచి వచ్చిందే. అయినా ‘సాక్షి’లో ఇన్వెస్టర్లెవరూ తమకు అన్యాయం జరిగిందని గానీ, తాము నష్టపోయామని గానీ వాపోవటం లేదు. తాము ఎక్కువ ధర పెట్టామని కూడా వారు అనుకోవటం లేదు. అలాంటిది వారి ప్రయోజనాలకు భంగం కలుగుతోందంటూ... వారు నష్టపోతున్నారంటూ ‘సాక్షి’ కుప్పకూలిపోవాలని నిత్యం కోరుకునేవారు గగ్గోలు పెట్టడమే చిత్రాతిచిత్రం.
|
0 comments:
Post a Comment