అవినీతికి ‘హైటెక్’ బాట

print this page

అవినీతికి ‘హైటెక్’ బాట



‘‘హైదరాబాద్ శివార్లలో ఐటీ/సాఫ్ట్‌వేర్ కేంద్రంగా హైటెక్ సిటీ నిర్మాణం గురించి అధికారికంగా ప్రకటించకముందే నాటి సీఎం చంద్రబాబు బినామీగా.. ఆయన సన్నిహిత మిత్రుడు, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అక్కడ భూముల కొనుగోళ్లు మొదలుపెట్టారు. 1996లో గచ్చిబౌలిలో రూ. 10 లక్షలు చెల్లించి 2.34 ఎకరాల భూమిని ఆయన కొన్నారు. కొద్దికాలానికే కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లలో హైటెక్ సిటీ ప్రాజెక్టును చంద్రబాబు ప్రకటించారు. తక్షణం ఆ గ్రామాల్లోని భూముల ధరలు నాటకీయంగా పెరిగిపోయాయి. మురళీమోహన్ ఈ గ్రామాల్లో పలు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థల కోసం అంటూ బాబు కేటాయించిన భూముల్లో చాలా వరకూ ఆయన తన బినామీ సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు వల్లూరిపల్లి నాగార్జున్ అనే వ్యక్తి స్థాపించిన వల్లూరిపల్లి ఆగ్రోటెక్, అర్జున్ కంప్యూటర్స్ వంటి సంస్థలు ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు సంపాదించుకున్నాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి సంస్థలూ స్థాపించకుండా వాటిని మురళీమోహన్‌కు, ఆయన గ్రూపు కంపెనీలకు బదిలీ చేశాయి.
హైటెక్ సిటీ ప్రాజెక్టు నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ రూ. 500 కోట్లు అధిక మొత్తంతో బిడ్ వేసినప్పటికీ బాబు ప్రభుత్వం దానిని ఆమోదించింది. ఆ సంస్థకు బాబు సర్కారు 150 ఎకరాల భూమినీ ధారాదత్తం చేసింది.

సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ దాని పరిధిలోకి తెచ్చిన బాబు.. మధ్యలో ఉన్న కొండాపూర్‌ను మాత్రం మినహాయించారు. తద్వారా అక్కడి మురళీమోహన్ భూములకు చార్జీల భారాన్ని తప్పించి ఖజానాకు గండి కొట్టారు.’’ 

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...