సత్యం ఇన్వెస్టర్లను ముంచి పెరిగిన విష వృక్షం

print this page

సత్యం ఇన్వెస్టర్లను ముంచి పెరిగిన విష వృక్షం

ఆ సంస్థే ఓ నిజాయితీ లేని నినాదం


వైఎస్ జగన్‌పై ఆ చానల్ అబద్ధాల అల్లికలు
మద్యం ఊసే నచ్చని జగన్ ఇంట్లో విదేశీ బార్ ఉందట!
70 గదులు, ఎస్కలేటర్లు, స్విమ్మింగ్‌పూల్ అంటూ
వీరంగమాడిన ఎల్లో మీడియా ఇంటికొచ్చి చూపించమంటే కిక్కురుమనని
అబద్ధాల పూనకాలరాయుళ్లు చంద్రబాబుకు చెంచాగిరీ చేసేందుకే ఎల్లోమీడియాలో (అ)సభ్యత్వం పుచ్చుకున్న టీవీ9
‘సత్యం’ను నిలువునా ముంచిన డబ్బుతో పుట్టిందే టీవీ9
సత్యం కంప్యూటర్స్‌ను అధోగతికి చేర్చిన శ్రీనిరాజు
సామాన్య పాత్రికేయుడైన రవిప్రకాష్..
14 కంపెనీలకు డెరైక్టర్!.. ఇదెలా సాధ్యమైంది?
మెరుగైన సమాజం అంటే ఏమిటి? అందులో సభ్యులెవరు?
కులాన్ని ద్వేషించటానికి నిర్వచనమేమిటి? ఏ కులాల్ని ద్వేషిస్తున్నారు?
వైఎస్ జగన్‌మీద అవాస్తవాలు ఎందుకు రాశారు? నిజాలైతే ఏవి ఆధారాలు?
సత్యం కుంభకోణానికి బాధ్యులెవరు? టీవీ9 శ్రీనిరాజు పాత్ర ఏమిటి?
టీవీ9... ఐ-ల్యాబ్స్... శ్రీ సిటీ... వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం ఏ విషపు విత్తుల నుంచి మొలకెత్తింది?
సుప్రభాతం పత్రికలో ఓ మామూలు రిపోర్టర్ ఇంతలోనే వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు?
వైఎస్ కుటుంబానికి సంబంధించి నిజాలు చెపితే టీవీ9కు వచ్చిన నష్టమేమిటి?
చంద్రబాబు ఎజెండాయే టీవీ9 జెండాగా ఎందుకు మారింది?

సంఘటన, ప్రకటన, వాస్తవం... వీటిమీద వ్యాఖ్యానించటం జర్నలిజంలో భాగమే. జరగని సంఘటన, చేయని ప్రకటన, అవాస్తవాల ఆధారంగా ఎవరు వార్తలు రాసినా, ప్రసారం చేసినా దాన్ని అమ్ముడుపోవటం కిందో, బ్లాక్‌మెయిలింగ్‌గానో అర్థం చేసుకునే విచక్షణ ప్రజలకు ఉంటుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రచారాలు ప్రారంభించిన టీవీ9, చంద్రబాబు విధానాలకు చంచాగిరీ చేసే కార్యక్రమంలో కథనాల స్థాయిని దాటి కథల స్థాయికి దిగజారిపోయింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో లోటస్ పాండ్ సమీపంలో జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, వారి సంస్థలకు చెందిన ఓ భవనం ఉంది.

సీబీఐ దర్యాప్తులో భాగంగా ఆ భవనం ప్రణాళిక, నిర్మాణం, విలువలను ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని ఏ మీడియా అయినా ప్రజలకు నివేదించటాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపట్టరు. వైఎస్ చేతిలో వరుస పరాజయాలపాలై, ప్రజల్లో ప్రతిష్ట పెంచుకోవటంలో అపజయమే తప్ప విజయం తెలియని చంద్రబాబు, ఇప్పుడు జగన్ సంస్థలు, ఆస్తులకు సంబంధించి సీబీఐ దర్యాప్తుమీద అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే, మూడు దశాబ్దాలుగా అదే ఆయన నైజం. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు కావలసినది ప్రచ్ఛన్న అధికారం. వైఎస్‌లకు ఉన్న అసాధారణ ప్రజాదరణ కారణంగా రాష్ట్రంలో చంద్రబాబు పార్టీ కుక్కిమంచం నుంచి అంగుళం ఎత్తు కూడా లేచేపరిస్థితిలో లేదు కాబట్టి, తన పత్రిక-ఛానల్ ద్వారా నిత్యం ఉషోదయాన వైఎస్‌ల మీద అసత్యాలు ప్రచారం చేయించటానికి రాజగురువు ఉబలాటపడుతున్నారంటే... అందుకు కారణం ఆయన పిచ్చి ఆయనకు ఆనందం! హాస్య నటులు, జోకర్లు హీరో డైలాగులు చెప్పి సవాళ్ళు విసిరితే వాటికెంత విలువ ఉంటుందో... చంద్రబాబు తోకగా అవతరించి ఆయన సేవలో తరిస్తున్న పత్రికకు, దాని అధినేత రాతలకు అంతే విలువ ఉంటుంది.

దూకుడు సినిమాలో ఎంఎస్‌నారాయణ మగధీర, సింహ, రోబో, యమదొంగ డైలాగులు చెప్పినప్పుడు ధియేటర్‌లో ప్రేక్షకుల్లో వచ్చే రియాక్షనే తోక పత్రికాధినేత ఫ్రంట్‌పేజీ సంత(క) సంపాదకీయాలకూ వచ్చితీరుతోంది. వైఎస్ మరణానంతరం ఈ పసుపు కూటమిలో టీవీ9 కూడా అసభ్యత్వం తీసుకుంది. అందులో భాగమే నిజాలతో నిమిత్తం లేని జర్నలిజం. ఆ సంస్థే ఓ నిజాయతీ లేని నినాదం. మెరుగైన సమాజం కోసం... అన్న డైలాగు వినగానే అందరిలో కలిగేది అనుమానమే తప్ప, నిబద్ధత కాదు- ఇంతకూ ఏ సమాజం కోసం? ఎవరి సమాజం కోసం? ఎవరి మెరుగు కోసం? వారి సమాజంలో సభ్యులెవరు?

మందు కొట్టి అసత్యాలు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భవంతిలో అన్ని బెడ్‌రూములున్నాయి... ఇన్ని ఎలివేటర్లున్నాయి... స్విమ్మింగ్ పూల్, ఫారిన్ బార్ ఉన్నాయి... అంటూ ఎల్లో మీడియా అడ్డదిడ్డంగా ప్రచారం చేస్తున్నప్పుడు, ఏనాడు నిజాలు చెప్పారుగనక- వీళ్ళ బతుకింతే అని ఊరుకోనూ వచ్చు. ఇందులో ఉన్నది కేవలం ఆస్తులకు సంబంధించిన అంశం కాదు.

ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. మద్యం ముట్టని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటిలో విదేశీ బార్ ఉందని ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది? ఎస్కలేటర్లు ఎక్కడివి? 70 బెడ్‌రూములు ఎక్కడున్నాయి? స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది? అసలిన్ని అబద్ధాలు ఎందుకు ఆడాల్సివచ్చింది? ఇంతకూ టీవీ9కు జగన్‌మీద కత్తికట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఉన్మాదంతో ఊగిపోతూ అసత్యాలను ప్రజలమీద గుమ్మరించటానికి ప్రయత్నిస్తున్న ఛానల్ ఏ సంకుచిత భావాల పునాదులమీద నిలబడింది? జగన్‌మీద ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాలకు సమాచార లోపం కారణం కానే కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఓ ముఠా కలసికట్టుగా ఆడుతున్న కపట నాటకం. ఇది నేరుగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచే కుట్రపూరితమైన సాహసం. కాబట్టే సాక్షి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అసత్య ప్రచారాలను నేరుగా సవాలు చేశాయి. నిజాలు చెప్పండన్నాయి. నిజాలను మాత్రమే తమ పత్రికల్లో, ఛానళ్ళలో నివేదించే అలవాటుంటే నేరుగా లోటస్ పాండ్ సమీపంలో ఉన్న భవనానికి రండి అని ఆహ్వానించాయి. పాఠకులు, ప్రేక్షకులు, మొత్తంగా ప్రజల పట్ల ఏ కొంచం గౌరవం ఉన్నా టీవీ9, ఇతర ఎల్లో మీడియా ఆ సవాలును స్వీకరించేవి.

ముగ్గురు ‘ఆర్’లు ఒక చంద్రుడు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ఉంటున్న భవంతి ప్రణాళిక, నిర్మాణం, వ్యయం అంచనాలు తీసుకుంటున్నారని ఉన్నది ఉన్నట్టుగా వార్త ఇస్తే చంద్రబాబు చతుష్టయంలోని ముగ్గురు ‘ఆర్’లకు గిట్టుబాటు కాదు. మద్యాన్ని ముట్టని, అదంటే గిట్టని వైఎస్ జగన్ ఇడుపులపాయలో జరిగిన పార్టీ తొలి ప్లీనరీలో ప్రజలకు ఇచ్చిన మాట వీరందరికీ గుర్తు లేక కాదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరను నిర్ణయిస్తామని జగన్ చేసిన వాగ్దానాన్ని ఎల్లో సిండికేట్ పెద్దలు ఏ మత్తులోనో బుర్రకు ఎక్కించుకొనకపోయి ఉంటే అది వారి సృ్పహకు సంబంధించిన లోపం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలాసాలకు అలవాటుపడి ఉంటే నిజానికి ఈ చతుష్టయం కంటే ఆనందించేవారు తెలుగుజాతి మొత్తంలో మరెవరూ ఉండరు. నిజానికి వీరి సమస్య జగన్ ప్రజల్లో ఉండటం.

మే నెలలో ఎర్రటి ఎండల్లో... ఆగస్టు వానల్లో... డిసెంబరు చలిలో ... నెలలూ సంవత్సరాల తరబడి సామాన్య ప్రజల్లో ఒకడిగా మమేకం కావటం. ఇంతకూ ఈ చతుష్టయాన్ని భయపెడుతున్నది జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ఆస్తులా... లేక ఆయనకు ప్రజల్లో దక్కుతున్న అభిమానమా? ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రజలను అడిగినా ఈ ప్రశ్నకు ఒకే సమాధానం వస్తుంది. ఒకవంక దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే దాన్ని ప్రభావితం చేసేలా వీరెందుకు దహించుకుపోతున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నట్టు? అసలింతకీ కొన్నేళ్ళ క్రితం వరకు వీరి బతుకులేమిటి? చంద్రబాబు, రామోజీ, తోక పత్రిక అధినేతలు వ్యవస్థలతో చెలగాటమాడిన వైనం ఇంటిల్లిపాదికీ తెలిసినా, తమమీద చట్టం ఈ రోజువరకు పనిచేయలేకపోయిందన్న విర్రవీగుడే వీరి మాటల్లో చేష్టల్లో అనునిత్యం వెల్లడవుతూ ఉంది.

వారి పాపం పండే రోజు... హాలాహల భాండం బద్దలయ్యే రోజు వచ్చి తీరుతుందన్నదే ఈ దేశంలో రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థలమీద విశ్వాసం ఉన్న ప్రజల నమ్మకం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రెండెకరాల నుంచి వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి పడగలెత్తిన చంద్రబాబు... అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేకి మద్దతు ప్రకటిస్తుంటే తెలుగుజాతి యావత్తు చప్పట్లు కొట్టలేదు, ముక్కున వేలేసుకుంది.

సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలోనే ఏకంగా రెండు వేల ఎకరాల భూమిని సంపదల కేంద్రీకరణ చట్టాలు, భూ గరిష్ట పరిమితి చట్టాలు, పర్యావరణ చట్టాలు తుంగలో తొక్కి రామోజీ ఏకంగా కొండలమీద బులెట్ ప్రూఫ్ ఇళ్ళు, కోటగోడలు నిర్మించుకుని ఆక్రమించుకున్నప్పుడు... మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో తమకు ఆర్‌బీఐ నిబంధనల మొదలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలేవీ వర్తించవని వాదిస్తున్నప్పుడు... తెలుగునాట పాఠకలోకం మౌనంగానే రాజగురువులో ఉన్న వికృతమైన అసలు మనిషిని చూడగలిగింది. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబుకు మనిషన్నవాడు చేయకూడని సహాయాలేవో చేసి... వందల కోట్లు మూటగట్టుకున్న ఓ మాజీ జర్నలిస్టు... కుర్రాళ్ళకైతే పాత కథలు తెలియవన్న అతితెలివితో తన చానల్‌లో లెక్చర్లు దంచటాన్ని కూడా సమాజం అఘాయిత్యంగానే చూస్తోంది. గురివిందకు తన కింద ఉన్న నలుపు తెలియదన్నట్టు, ఈ ముగ్గురికీ మీడియాలో తోడైన మరో అభినవ ఆషాఢభూతి టీవీ9. అదెలాగో చూడండి....

సత్యం నిధుల తరలింపు సమయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీని రాజు
కుంభకోణం బయటపడుతుందనే భయంతో ముందుగానే గుడ్‌బై
అప్పటికే షేరుతో ఆటలు.. దీనికి తోడైన కేతన్ పరేఖ్ మాయాజాలం
అప్పనంగా దక్కిన షేర్లను గరిష్ట ధరకు విక్రయించుకుని ఉడాయింపు
ఆ సొమ్ముతో చింతలపాటి హోల్డింగ్స్ దాన్నుంచి పుట్టుకొచ్చిందే టీవీ9
మోసపోయిందల్లా సత్యం ఇన్వెస్టర్లే
నేరం స్పష్టంగా కనిపిస్తున్నా శ్రీనిరాజుపై పడని సీబీ‘ఐ’
ఐల్యాబ్స్ పేరిట బాబు హయాంలో ఆరెకరాల భూమి కేటాయింపు
ఆ తరవాత శ్రీ సిటీ సెజ్ ప్రారంభం
మారిషస్ కంపెనీల నుంచీ టీవీ9కు నిధులు?
ఇంతకీ సయీఫ్-3 ఎవరి సంస్థ?
సుప్రభాతం పత్రికలో మూడువేల ఉద్యోగికి వందల కోట్లు ఎలా వచ్చాయి?

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...