1999-2002 మధ్యే ‘సత్యం వధ’!

print this page

1999-2002 మధ్యే ‘సత్యం వధ’!




సత్యం కుంభకోణం అసలు ఎప్పుడు జరిగింది? నిధుల కైంకర్యం ఏ సంవత్సరాల్లో జరిగిందన్న అంశాన్ని నిర్ధారణ చేసేలాగా 2010 మార్చి 28న సన్‌డే టైమ్స్‌లో ఓ వార్తా కథనం ప్రచురితమైంది. 1999లోనే సత్యం డబ్బు లండన్‌లోని బినామీ, బోగస్ అకౌంట్లకు తరలటం ఎలా ప్రారంభమైనదీ ఆ కథనం వివరించింది. అలాగే, 1999లోనే సత్యం సంస్థ ఇన్వెస్టర్ల సొమ్మును అడ్డదిడ్డంగా వెదజల్లి కోటి రూపాయల విలువ కూడా లేని డాట్‌కామ్ కంపెనీలను వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఉదాహరణకు- నిత్యం వెబ్ ఉపయోగించేవారిలో అత్యధికులు ఇండియా వరల్డ్ అనే సైట్‌ను ఏనాడూ బ్రౌజ్ చేసి ఉండరు. అలాంటిది సత్యం ఆ సంస్థను రూ.500 కోట్లకు కొనుగోలు చేసినట్టు చూపింది. ఇంతకీ ఇండియా వరల్డ్ వార్షిక అమ్మకాలు ఎంత అంటే... కేవలం కోటి రూపాయలు. సంవత్సరానికి నికర లాభం ఎంత అంటే... కేవలం రూ. 25 లక్షలు. అలాంటి సంస్థను రూ. 500 కోట్లకు కొన్నట్టు చూపారంటే... ఇలా అనేక సంస్థలను సత్యం ఖాతాలో కొనుగోలు చేశారంటే, ఈ సొమ్మంతా ఎవరికి ముట్టినట్టు?

శ్రీని రాజు చెప్పిన ‘సత్యం’ అనే కథ!

చేపా చేపా ఎందుకు ఎండలేదంటే... పిల్లలకు చెప్పిన కథ మాదిరిగానే ఆనాడు తాను ఎందుకు వైదొలగినదీ ఇదే శ్రీను బాబు 2009 జనవరి 20న, అంటే సత్యం రామలింగరాజు ఇక బయటకు వచ్చే అవకాశం ఇప్పుడప్పుడే లేదని గట్టిగా నిర్ధారించుకున్నాక... ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చక్కటి కథ చెప్పారు. ఎప్పుడో 1999లోనే తాను నిధుల విషయంలో సత్యం యాజమాన్యంతో విభేదించానని... పదేళ్ళ తరవాత(మెరుగైన సమాజం కోసం) మిగతా ప్రపంచానికి వెల్లడించారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...