‘మైసూరా’ను బయటకు పంపేందుకే బాబు కుట్ర

print this page
కిరణ్ సర్కార్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ 
చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ అని ధ్వజం
కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్ల గల్లంతు ఖాయం

కరీంనగర్, న్యూస్‌లైన్: తన ఫిలింసిటీలో ప్రభుత్వ భూమి లేదని ప్రకటిస్తున్న రాజగురివింద రామోజీరావుకు ధైర్యం ఉంటే పట్టా చూపించాలని, తాను ప్రభుత్వ భూమి అని ఆధారాలతో సహా నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 1949లో జాగీదార్ల వ్యవస్థ రద్దయిందని, కౌలుదారులకు ప్రభుత్వం పట్టా ఇచ్చి జాగీర్‌దారులకు కొంత శిస్తు మొత్తాన్ని అందించిందని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ అనాజ్‌పురం పరిధిలోకి వస్తుందని, అక్కడ జాగీర్‌దారుల వ్యవస్థ లేదని, భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేదని వివరించారు. 

కౌలుదార్లు లేని కారణంగా ప్రభుత్వం సైతం ఎవరికి పట్టాలు పంపిణీ చేయలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫిలింసిటీ ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూమి ప్రభుత్వానిదేన్నారు. భూ ఆక్రమణలపై ఒకవైపు తహశీల్దార్లు, ఆర్డీఓలు విచారించి ప్రభుత్వానికి నివేదిక పంపించగా, మరోవైపు లోకయుక్త నాలుగైదు గ్రామాల్లో విచారించి తీర్పు చెప్పే సమయంలో రామోజీ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న మూడువేల ఎకరాలలో 1300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అని, మిగిలింది భూదాన భూమి అని స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న రహదారిని సైతం ఆక్రమించుకున్న విషయం బయటపడినా రామోజీపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. వైఎస్ జీవించి ఉంటే రామోజీ భూబాగోతానికి అడ్టుకట్ట పడేదని, రోశయ్య, ప్రస్తుత కిరణ్ సర్కార్ రామోజీరావుతో మ్యాచ్ ఫిక్సియిన కారణంగానే చర్యలు లేవని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయంలో ఉన్న గ్రీన్‌బుక్‌ను తెరిచి పరిశీలించాలని కోరారు.

‘మైసూరా’ను బయటకు పంపేందుకే బాబు కుట్ర 

ఎంవీ మైసూరారెడ్డిని వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి బయటకు పంపే కుట్రలో భాగమే టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లోమీడియాతో సిమెంట్ పరిశ్రమకు భూకేటాయింపుల వ్యవహారాన్ని బయట పెట్టించాడని గోనె ప్రకాష్‌రావు ఆరోపించారు. చంద్రబాబు వాడుకోని వ దిలేయడంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గద్దె నెక్కడానికి హరికృష్ణను అడ్డంపెట్టుకున్న చంద్రబాబు.. లాల్‌బహదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ మృతదేహం ఉంటే అక్కడికి వెళ్లలేక లక్ష్మీపార్వతిని గెంటేసి తర్వాత దహనకాండ కార్యక్రమంలో పాల్గొన్నాడన్నారు. హరికృష్ణకు ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవీ కట్టబెట్టి, దగ్గుబాటిని ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మభ్యపెట్టిన ఆయన, ఆ తర్వాత వాడుకొని వదిలేశాడన్నారు. దేవేందర్‌గౌడ్ తెలంగాణ పల్లవి ఎత్తితే నాగం జనార్దన్‌రెడ్డిని పావుగా వాడుకున్నాడని, అదే ‘నాగం’ తెలంగాణ అంశాన్ని లేవనెత్తగా.. దయాకర్‌రావు, దేవేందర్‌లను ఉసిగొల్పుతున్నాడని విమర్శించారు. ఈ విధంగానే మైసూరారెడ్డిని బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గ్లామర్‌ను వాడుకునేందుకు అతని తల్లికి ఎనలేని గౌరవం ఇచ్చి తర్వాత ఎన్టీఆర్‌కు వారసులే లేరని ప్రకటించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మటుమాయం అవుతాయని పేర్కొంటున్న చంద్రబాబు ఉప ఎన్నికలో ఒక్క సీటైనా దక్కించుకుంటాడా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కని పార్టీగా తెలుగుదేశం మిగిలిపోవడం ఖాయమని గోనె జోస్యం చెప్పారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...